ఇకనుంచి ప్రజల్లోకి వెళతాం: లగడపాటి | i stand for united state, says lagadapati rajagopal | Sakshi
Sakshi News home page

ఇకనుంచి ప్రజల్లోకి వెళతాం: లగడపాటి

Aug 23 2013 4:10 PM | Updated on Sep 1 2017 10:03 PM

ఇకనుంచి ప్రజల్లోకి వెళతాం: లగడపాటి

ఇకనుంచి ప్రజల్లోకి వెళతాం: లగడపాటి

సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో తాము కూడా ప్రజల్లోకి వెళతామని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలిపారు

ఢిల్లీ:సమైక్యాంధ్రా ఉద్యమం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో తాము కూడా ప్రజల్లోకి వెళతామని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలిపారు.  కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏర్పాటు చేసిన ఆంటోని కమిటీపై తనకు అభ్యంతరం లేదన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం మీడియాతో లగడపాటి మీడియాతో మాట్లాడారు.  ఇకనుంచి ప్రజల్లోకి వెళ్లి ఉద్యమం చేస్తామన్నారు. యూపీఏ సర్కారు విభజన ప్రక్రియను నిలిపివేసి చర్చలు జరపాలని లగడపాటి డిమాండ్ చేశారు. ఎంపీల సస్పెన్షన్ పార్టీల నిర్ణయం కాదని..అది పార్లమెంట్ నిర్ణయమన్నారు.

 

సీమాంధ్రలో ఉద్యమం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో రాజకీయ నేతలు ప్రజల్లోకి వెళ్లి  వారితో అడుగువేయాడానికి యత్నాలు ఆరంభించారు. సమైక్య నినాదంతో సీమాంధ్ర జిల్లాలో నిరసన గళం ఊపందుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement