
'వారి మరణం బాధ కలిగిస్తోంది'
సైనికుల త్యాగాన్ని ఎల్లప్పుడూ గుర్తిస్తామని రక్షణమంత్రి మనోహర్ పారికర్ తెలిపారు.
న్యూఢిల్లీ: సైనికుల త్యాగాన్ని ఎల్లప్పుడూ గుర్తిస్తామని రక్షణమంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. సైనికుల మరణం తనకెంతో బాధ కలిగిస్తుందని చెప్పారు. 66వ సైనిక దినోత్సవంలో సోమవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... దేశాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నించే శత్రువులను తుదముట్టించాల్సిన అవసరముందన్నారు.
చెన్నై వరదలు సందర్భంగా సైనికులు చేపట్టిన సహాయక కార్యక్రమాలను ఆయన ప్రశంసించారు. విపత్కర పరిస్థితుల్లోనూ గొప్ప సేవలందించారని మెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో వచ్చే సమాచారమంతా విశ్వసించలేమని చెప్పారు. తప్పుడు సమాచారం, అనవసర విషయాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమవుతున్నాయని పారికర్ ఆందోళన వ్యక్తం చేశారు.