డీఆర్‌డీవో పాస్‌వర్డ్‌ మర్చిపోయింది? | Has the drdo forgotten its fb password? | Sakshi
Sakshi News home page

డీఆర్‌డీవో పాస్‌వర్డ్‌ మర్చిపోయింది?

Jan 20 2017 5:24 PM | Updated on Jul 26 2018 5:23 PM

డీఆర్‌డీవో పాస్‌వర్డ్‌ మర్చిపోయింది? - Sakshi

డీఆర్‌డీవో పాస్‌వర్డ్‌ మర్చిపోయింది?

దేశ రక్షణ వ్యవహారాల్లో, దేశ ఆయుధ సంపత్తిని పెంపొందిచే విషయంలో నిత్య నూతన ప్రయోగాలు చేసే భారతదేశ డీఆర్‌డీవో(డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌) తన పాస్‌వర్డ్‌ను మర్చిపోయిందంటే ఇక అవాక్కవక తప్పదేమో..

న్యూఢిల్లీ: ఓ సాధారణ వ్యక్తి తన విలువైన ఆన్‌లైన్‌ ఖాతా పాస్‌వర్డ్‌ మర్చిపోయాడంటే నమ్మొచ్చు.. లేదా ఓ సంస్థ అలాగే మర్చిపోయిందంటే అవునేమో అనుకోవచ్చు.. కానీ దేశ రక్షణ వ్యవహారాల్లో, దేశ ఆయుధ సంపత్తిని పెంపొందిచే విషయంలో నిత్య నూతన ప్రయోగాలు చేసే భారతదేశ డీఆర్‌డీవో(డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌) తన పాస్‌వర్డ్‌ను మర్చిపోయిందంటే ఇక అవాక్కవక తప్పదేమో..

అవును డీఆర్‌డీవో తన అధికారిక ఫేస్‌బుక్‌ పేజీకి సంబంధించిన పాస్‌ వర్డ్‌ ను మర్చిపోయిందంట. ఈ విషయాన్ని స్వయంగా తానే ట్విట్టర్‌ ద్వారా ఫేస్‌బుక్‌కు తెలియజేసింది. ‘మేం ఇండియన్‌ డీఆర్‌డీవో తరుపున మిమ్మల్ని సంప్రదిస్తున్నాం. మా అధికారిక ఫేస్‌బుక్‌ పేజీ ఓపెన్‌ అవడం లేదు’ అంటూ ఫేస్‌బుక్‌ కు డీఆర్‌డీవో ట్వీట్‌ చేసింది. నిత్యం డీఆర్‌డీవోను ఫాలో అయ్యే ట్విట్టర్‌ ఖాతా దారులు కాస్త ఈ ట్వీట్ ను చూసి  అవాక్కయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement