చలాన్లు.. ఇంతనా...!? | Gurugaon traffic police have issued 1800 challans per day | Sakshi
Sakshi News home page

చలాన్లు.. ఇంతనా...!?

Sep 3 2017 1:15 PM | Updated on Sep 27 2018 2:34 PM

దేశంలో అత్యధికంగా చలాన్లు విధించే ప్రాంతంగా గుర్గావ్‌ రికార్డులకు ఎక్కుతోంది.

గుర్గావ్‌: దేశంలో అత్యధికంగా చలాన్లు విధించే ప్రాంతంగా గుర్గావ్‌ రికార్డులకు ఎక్కుతోంది.  ఇక్కడ సగటున రోజుకు 1700 - 1900 వం‍దల చలాన్లును పోలీసులు విధిస్తున్నారు.  ఒక్క ఆగస్టు 16న అక్షరాల 4 లక్షల 93 వేల చలాన్లు విధించారు.  ఈ చలాన్ల వల్ల ఒక్క రోజే 80 లక్షల రూపాయలు జమ అయింది.   
 
ప్రతి రోజూ 
గుర్గావ్‌లో ప్రతి రోజూ వందల సంఖ్యలో చలాన్లను పోలీసులు విధిస్తున్నారు. మరీ ముఖ్యంగా రాంగ్‌ సైడ్‌ పార్కింగ్‌, ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమించడం రాంగ్‌ రూట్‌ డ్రైవింగ్‌ వంటివి అధికం.  రెండుమూడు కేటగిరీల్లోనే రోజూ కనీసం 1700 చలాన్లను విధిస్తున్నట్లు ట్రాఫిక్‌ పోలీసులు చెబుతున్నారు.    
 
మొత్తంగా..!
జనవరి ఒకటి నుంచి గుర్గావ్‌ పోలీసులు సీట్‌ బెల్ట్‌ ధరించలేదని 49,245, రాంగ్‌ రూట్‌ డ్రైవింగ్‌ చేసిన వారికి 38,505,  అత్యంత వేగంగా డ్రైవింగ్‌ చేసినవారికి 8,132,  నో పార్కింగ్‌ చేసినవారికి 6,791 చలాన్లు విధించినట్లు అధికారులు చెబుతున్నారు.  ట్రాఫిక్‌ పర్యవేక్షణ కన్నా.. చలాన్ల విధించడంపైనే డ్యూటీ సమయం గడిచిపోతోందని  ట్రాఫిక్‌ పోలీసులు వాపోతున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement