గుల్బర్గ్ సొసైటీ కేసు:తీర్పు శుక్రవారానికి వాయిదా | Gulbarg society case: Sentencing on June 17 | Sakshi
Sakshi News home page

గుల్బర్గ్ సొసైటీ కేసు:తీర్పు శుక్రవారానికి వాయిదా

Jun 13 2016 12:00 PM | Updated on Sep 4 2017 2:23 AM

గుల్బర్గ్ సొసైటీ మారణహోమం కేసులో దోషులకు శిక్ష ఖరారు మరోసారి వాయిదా పడింది. న్యాయస్థానం తీర్పును ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది.

న్యూఢిల్లీ: గుల్బర్గ్ సొసైటీ మారణహోమం కేసులో దోషులకు శిక్ష ఖరారు మరోసారి వాయిదా పడింది. న్యాయస్థానం తీర్పును ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. కాగా  ఈ నెల 2వ తేదీన ప్రత్యేక కోర్టు జడ్జి పీబీ దేశాయ్ 66 మంది నిందితుల్లో 24 మందిని దోషులుగా తేల్చారు. మిగిలిన 36 మందిని నిర్దోషులుగా తేలుస్తూ కోర్టు తీర్పునిచ్చింది. గుల్బర్గ్ సొసైటీలో జరిగిన దాడికి ఎటువంటి ప్రణాళికలు రచించలేదని, అప్పటికప్పుడు దాడి జరిగినట్లు కోర్టు తెలిపింది. దీనివెనక కుట్ర లేదని స్పష్టం చేసింది. నిందితుల్లో ఐదుగురు మరణించగా ఒకరి ఆచూకీ లేకుండా పోయింది. దోషులుగా తేల్చిన 24 మందిలో 11 మందిపై హత్య కేసును నమోదు చేయగా, 13 మందిపై సాధారణ కేసులు నమోదు చేశారు.

తొమ్మిదేళ్ళ క్రితం గోద్రా రైలు దుర్ఘటన అనంతరం 2002 ఫిబ్రవరి 28న గుల్బర్గా సొసైటీ అల్లర్లలో ఎహసాన్‌ జాఫ్రితో సహా 69 మంది మరణించారు. తొలుత దీనిపై సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక విచారణా బృందం (సిట్‌) దర్యాప్తు చేసి 63మందిని విచారణలో చేర్చింది. గుల్బర్గ సొసైటీ అల్లర్ల కేసులో మోడీ, తదితరులపై జకియా చేసిన ఫిర్యాదు ఆధారంగా సుప్రీంకోర్టు సిట్‌ను విచారణకు నియమించింది.

gulbarg society massacre,verdict,  quantum of punishment,గుల్బర్గ్ సొసైటీ హత్యాకాండ, తీర్పు వాయిదా, దోషులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement