గుజరాత్ భారత్‌లో లేదా?: సుప్రీం | Gujarat in India or not? : Supreme Court | Sakshi
Sakshi News home page

గుజరాత్ భారత్‌లో లేదా?: సుప్రీం

Feb 2 2016 2:29 AM | Updated on Sep 5 2018 8:24 PM

గుజరాత్ తదితర రాష్ట్రాల్లో ఆహార భద్రత చట్టం అమలు చేయకపోవడాన్ని సుప్రంకోర్టు తీవ్రంగా పరిగణించింది.

న్యూఢిల్లీ: గుజరాత్ తదితర రాష్ట్రాల్లో ఆహార భద్రత చట్టం అమలు చేయకపోవడాన్ని సుప్రంకోర్టు  తీవ్రంగా పరిగణించింది. పార్లమెంట్ తెచ్చిన చట్టాన్నీ పట్టించుకోకపోతే ఎలా అంది. ‘ఇది దేశం మొత్తానికీ వర్తించే చట్టం. కానీ గుజరాత్ దీన్ని అమలు చేయడం లేదు. గుజరాత్ భారత్‌లో భాగం కాదా?  పార్లమెంట్ ఏంచేస్తోంది’ అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కరువు బాధిత రాష్ట్రాల్లో ఉపాధి హామీ, జాతీయ ఆహార భద్రత తదితరాలపై ప్రస్తుత పరిస్థితిపై వివరాలు తమ ముందుంచాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఆహార భద్రత వంటి సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ, ఏపీ తదితర కరువు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని దాఖలైన వహిస్తున్నాయంటూ స్వరాజ్ అభియాన్ వేసిన పిల్‌ను సోమవారం సుప్రీమ్ కోర్టు మరోసారి విచారించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement