ఢిల్లీ పర్యటనలో ఉన్న ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ మంగళవారం కేంద్ర రక్షణమంత్రి మనోహర్ పారికర్తో సమావేశమయ్యారు.
న్యూఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో ఉన్న ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ మంగళవారం కేంద్ర రక్షణమంత్రి మనోహర్ పారికర్తో సమావేశమయ్యారు. నిన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర హోంమంత్రి రాజనాథ్ సింగ్ను కలిసిన ఆయన ఇవాళ పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. అలాగే హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మెహర్షితో గవర్నర్ దాదాపు గంటన్నరపాటు సమావేశం అయిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.