ఆధార్‌కు ‘బయోమెట్రిక్‌’ భద్రత | Government Authorities will sign biometric signature on the basis of Aadhaar | Sakshi
Sakshi News home page

ఆధార్‌కు ‘బయోమెట్రిక్‌’ భద్రత

Oct 30 2017 3:57 AM | Updated on May 25 2018 6:12 PM

Government Authorities will sign biometric signature on the basis of Aadhaar - Sakshi

న్యూఢిల్లీ: ఆధార్‌ నమోదు, మార్పులు చేర్పుల దరఖాస్తులపై ప్రభుత్వ ఉద్యోగులు, పోస్టాఫీస్, బ్యాంకు సిబ్బంది బయోమెట్రిక్‌ సంతకం చేసేలా ఆధార్‌ ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) కొత్త విధానం తీసుకురానుంది. పౌరుల బయోమెట్రిక్, ఇతర కీలక సమాచారం భద్రతపై ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు యూఐడీఏఐ సీఈఓ అజయ్‌ పాండే చెప్పారు. ఈ వ్యవస్థ జనవరి కల్లా అమల్లోకిరావచ్చు. ఆధార్‌ దరఖాస్తు స్వీకరించగానే సంబంధిత సిబ్బంది దానిపై బయోమెట్రిక్‌ సంతకం చేయాలి. ఇప్పుడు అధీకృత ప్రైవేట్‌ ఆపరేటరే దరఖాస్తుపై సంతకం చేస్తున్నారని ఇకపైప్రభుత్వ, పోస్టాఫీస్, బ్యాంకు సిబ్బంది దానిపై బయోమెట్రిక్‌ రూపంలో కౌంటర్‌ సంతకం చేస్తారు.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement