చెత్తకుండీలో రెండు కిలోల బంగారం | gold recovered from dustbin in toilet at Mumbai Airport | Sakshi
Sakshi News home page

చెత్తకుండీలో రెండు కిలోల బంగారం

Mar 4 2017 10:24 PM | Updated on Aug 28 2018 5:25 PM

చెత్తకుండీలో రెండు కిలోల బంగారం - Sakshi

చెత్తకుండీలో రెండు కిలోల బంగారం

చెత్తకుండీలో కిలోల బంగారం లభ్యమవడం ముంబై ఎయిర్ పోర్టులో కలకలం రేపింది.

ముంబై: చెత్తకుండీలో కిలోల బంగారం లభ్యమవడం ముంబై ఎయిర్ పోర్టులో కలకలం రేపింది. ముంబై విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ కౌంటర్ల పక్కనే ఉన్న టాయ్‌లెట్ లోకి ఓ గుర్తుతెలియని వ్యక్తి ప్రవేశించాడు. బయటకు వచ్చిన తర్వాత అతడి కదలకలపై అనుమానం వచ్చిన ఎయిర్ పోర్ట్ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు.

టాయ్‌లెట్‌లో కిలో బరువైన రెండు బంగారు బిస్కట్లను దాచినట్లు నిందితుడు పోలీసుల విచారణంలో వెల్లడించాడు. వెంటనే ఎయిర్ పోర్ట్ సిబ్బంది చెత్తకుండీలో ఉన్న రెండు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement