అత్యాచార కేసులో నిందితుడికి మరణశిక్ష

Gives Judgment 46 Days In Rape Incident - Sakshi

తీర్పును వెలువరించిన మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ జిల్లా కోర్టు

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లోని ఓ జిల్లా కోర్టు శనివారం సంచలన తీర్పును వెలువరించింది. తొమ్మిదేళ్ల బాలికపై జరిగిన అత్యాచార కేసులో నిందితుడికి మరణశిక్ష విధిస్తూ సాగర్‌ జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. మే 21 తేదిన తొమ్మిదేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంటి సమీపంలో ఆడుకుంటున్న బాలికను నలబైఏళ్ల వ్యక్తి పక్కనున్న గుడి సమీపంలోకి ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు  విచారణ చేపట్టారు. కేవలం మూడు రోజుల్లోనే విచారణ పూర్తి చేసిన పోలీసులు మే 25న పూర్తి వివరాలను కోర్టును సమర్పించారు.

మొత్తం ఇరవైమంది సాక్షులను విచారించిన కోర్టు ఘటన జరిగిన 46 రోజుల్లోనే  తీర్పును వెలువరించడం విశేషం. లైంగిక వేధింపుల నుంచి పిల్లల రక్షణ (పోస్కో) చట్టం, ఐపీసీ సెక్షన్‌ 376(అత్యాచారం), సెక్షన్‌ 366(అపహరణ) సెక్షన్‌ల పై విచారణ చేపట్టి శిక్ష విధించినట్లు అడిషనల్‌ సెషన్స్‌ న్యాయమూర్తి సుధాన్ష్‌ సక్సేనా తీర్పులో పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top