బర్రెల్ని పంపిణీ చేసిన సీఎం సతీమణి | on Gandhi jayanti buffaloes distributed by Amruta fadnavis | Sakshi
Sakshi News home page

బర్రెల్ని పంపిణీ చేసిన సీఎం సతీమణి

Oct 2 2017 7:52 PM | Updated on Oct 2 2017 8:15 PM

on Gandhi jayanti buffaloes distributed by Amruta fadnavis

నాగ్‌పూర్‌ : జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పేదలకు బర్రెల్ని పంపిణీచేసి ఆదర్శంగా నిలిచారు అమృతా ఫడ్నవిస్‌. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ సతీమణిగానే కాక బ్యాంకర్‌, సింగర్‌, సోషల్‌ వర్కర్‌గా బహుముఖ ప్రజ్ఞతో నిత్యం వార్తల్లో నిలిచే ఆమె మరోసారి తనదైన శైలిని కనబర్చారు.

‘శ్రీమంతుడు’ తరహాలో నాగ్‌పూర్‌ జిల్లాలోని కవ్దాస్‌ గ్రామాన్ని దత్తత తీసుకున్న అమృత ఫడ్నవిస్‌.. గాంధీ జయంతి సందర్భంగా సోమవారం గ్రామంలో పర్యటించారు. భర్తలను కోల్పోయిన పలువురు పేద మహిళలకు బర్రెలను పంచారు. అనంతరం నీటిశుద్ధీకరణ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. అధికార బీజేపీ ప్రభుత్వం సైతం బర్రెల పంపిణీ పథకాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, సీఎం సతీమణి పంచిన బర్రెలు ప్రభుత్వ పథకంలో భాగంగానా లేక వ్యక్తిగతంగానా అనేది తెలియాల్సిఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement