భారత్కు పెరిగిన విదేశీ పర్యాటకుల తాకిడి | foreign tourist arrived in India in January as compared same month last year | Sakshi
Sakshi News home page

భారత్కు పెరిగిన విదేశీ పర్యాటకుల తాకిడి

Feb 17 2016 7:05 PM | Updated on Oct 4 2018 6:57 PM

గత ఏడాది జనవరితో పోల్చితే ఈ సంవత్సరం జనవరిలో విదేశీ టూరిస్ట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది.

గత ఏడాది జనవరితో పోల్చితే ఈ సంవత్సరం జనవరిలో విదేశీ టూరిస్ట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత ఏడాది జనవరిలో 7.91 లక్షల మంది విదేశీ పర్యాటకులు మన దేశాన్ని సందర్శించగా, ఈ సంఖ్య 2016 జనవరిలో 8.44 లక్షలకు పెరిగింది. విదేశీ పర్యటకుల సంఖ్య రికార్డు స్థాయిలో 6.8 వృద్ధిని సాధించింది. టూరిజం నుంచి వచ్చే విదేశీ మారక నిల్వలు(ఫారన్ ఎక్స్ఛేంజ్ ఎర్నింగ్స్) గత ఏడాది జనవరితో పోల్చితే ఈ ఏడాది 13 శాతం పెరిగాయని ప్రభుత్వం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.  

విదేశీ పర్యటకులలో జనవరి నెలలో టాప్ స్థానంలో నిలిచిన దేశాలు:
1) అమెరికా 2) బంగ్లాదేశ్ 3) యూకే  4) కెనడా 5) అస్ట్రేలియా  6)రష్యా  7)జర్మనీ  8)ఫ్రాన్స్  9) శ్రీలంక  10)చైనా 11) మలేషియా  12) జపాన్  13)కొరియా  14)నేపాల్ 15) అఫ్ఘనిస్తాన్  

మన దేశంలో ఎక్కువగా విదేశీ పర్యటకులు అడుగుపెట్టిన ప్రాంతాలు:
1)ఢిల్లీ ఎయిర్ పోర్టు  2)ముంబై ఎయిర్ పోర్టు  3) చెన్నై ఎయిర్ పోర్టు   4)హరిదాస్ పూర్ లాండ్ చెక్ పోస్ట్  5)బెంగళూరు ఎయిర్ పోర్టు   6) గోవా ఎయిర్ పోర్టు 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement