కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ సోమవారం లోక్సభలో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. కేంద్ర మంత్రివర్గం లాంఛనప్రాయంగా బడ్జెట్కు ఆమోదం తెలిపిన అనంతరం సభలో ప్రవేశ పెట్టారు.
ఈ నేపథ్యంలో దాదాపు దేశీయ ఉత్పత్తులపై దృష్టిని సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకుగాను స్టార్ట్ప్ కార్యక్రమానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తూ 2016 - 2019 మధ్య కాలంలో కొత్త ఆవిష్కరణలతో వచ్చే వారికి వంద శాతం మూడేళ్లపాటు పన్నుపోటు ఉండదని చెప్పారు. దీని ప్రకారం దేశీయ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఎక్కువని ఆయన సంకేతాలు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వోద్యోగుల కోసం ఏడో వేతన సంఘం చేసిన సూచనలు, ఓఆర్ఓపీ పథకాలకు చేయాల్సిన చెల్లింపులు బడ్జెట్ మీద అధికభారం కానుందన్నారు.