హైదరాబాద్ ఫ్లైట్ అత్యవసర ల్యాండింగ్ | flight makes emergency landing due to unwell passenger | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ ఫ్లైట్ అత్యవసర ల్యాండింగ్

Nov 30 2015 7:28 PM | Updated on Sep 4 2018 5:07 PM

హైదరాబాద్ నుంచి కోల్కతా వెళ్తున్న ఓ విమానాన్ని సోమవారం భువనేశ్వర్లోని బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.

భువనేశ్వర్: హైదరాబాద్ నుంచి కోల్కతా వెళ్తున్న ఓ విమానాన్ని సోమవారం భువనేశ్వర్లోని బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడికి ఛాతినొప్పి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

అస్వస్థతకు గురైన ప్రయాణికుడిని చికిత్స నిమిత్తం భువనేశ్వర్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. 30 నిమిషాల అనంతరం విమానం కోల్కతాకు బయల్దేరినట్టు విమానాశ్రయ అధికారులు చెప్పారు. అస్వస్థతకు గురైన ప్రయాణికుడిని శశి మీనన్గా గుర్తించారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్టు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement