దక్షిణ ధృవాన్ని చేరిన తొలి ఐపీఎస్‌ అపర్ణ

The first IPS appeal to join the South Pole - Sakshi

న్యూఢిల్లీ: అంటార్కిటికా ఖండంలో దక్షిణ ధృవంలో భూగ్రహం చిట్టచివరి భూభాగమైన ‘సౌత్‌ పోల్‌’సూచీబోర్డును చేరిన తొలి మహిళా ఐపీఎస్‌గా ఇండో–టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ అధికారిణి అపర్ణా కుమార్‌ (44) రికార్డులకెక్కారు. మంగళవారం ఢిల్లీలో తనను మర్యాదపూర్వకంగా కలసిన సందర్భంగా ఆమెను హోం మంత్రి రాజ్‌నాథ్‌ అభినందించారు. 2002 బ్యాచ్‌ యూపీ క్యాడర్‌ ఐపీఎస్‌ అయిన అపర్ణా తనకు ఆరేళ్లుగా సాహసోపేత పర్వతారోహణలో ఎదురైన అనేక అనుభవాలను రాజ్‌నాథ్‌కు వివరించారు. మైనస్‌ 48 డిగ్రీల గడ్డకట్టే చలిలో 111 మైళ్లు నడిచి చిట్టచివరి భూప్రాంతానికి చేరుకోగలిగామని ఆమె తెలిపారు. సౌత్‌పోల్‌ను చేరుకునేందుకు ఎనిమిదిరోజులపాటు ట్రెక్కింగ్‌ చేసి జనవరి 13న ఎనిమిది మంది బృందంతో కలసి అక్కడికి చేరుకున్నానని వెల్లడించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top