ఎఫ్‌బీలో ఆ ఫోటోలతో విసిగిపోయారా..?
చాటింగ్ పర్సన్, గ్రూప్ లేదా పేజీ నుంచి యూజర్ మెరుగైన రీతిలో వైదొలగేందుకు స్నూజ్ ఫీచర్ మెరుగైందని భావిస్తున్నారు.
శాన్‌ఫ్రాన్సిస్కోః ఫ్రెండ్స్ పోస్ట్ చేసే ఫోటోలు, పేజీలు, గ్రూపులతో విసిగిపోతే అన్‌ఫ్రెండ్ చేయడం, అన్‌ఫాలోయింగ్ చేయకుండానే వాటికి తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చేలా ‘స్నూజ్’ బటన్‌ను ప్రవేశపెట్టేందుకు ఫేస్‌బుక్ కసరత్తు చేస్తోంది. ‘ అనవసరమైన ఫోటోలు, పేజీలు, గ్రూపుల బారినపడకుండా ప్రజలు తమకు నచ్చిన స్టోరీలు, తమకు సంబంధించిన వాటితోనే కనెక్ట్ అయ్యేలా నూతన మార్గాలను తాము పరిశీలిస్తున్నామ’ని ఫేస్‌బుక్ ప్రతినిధి పేర్కొన్నారు.
ఈ పద్ధతి ద్వారా ఫ్రెండ్, పేజ్, గ్రూప్‌లను 24 గంటల పాటు లేదా ఏడు నుంచి 30 రోజుల వరకూ చూడకుండా స్నూజ్ ఫీచర్‌ను ప్రెస్ చేయవచ్చని చెప్పారు. యూజర్లు ఈ ఖాతాలు, పేజ్‌లను మొత్తానికి అన్‌ఫాలో కావచ్చని తెలిపారు. చాటింగ్ పర్సన్, గ్రూప్ లేదా పేజీ నుంచి యూజర్ మెరుగైన రీతిలో వైదొలగేందుకు స్నూజ్ ఫీచర్ మెరుగైందని భావిస్తున్నారు. అయితే స్నూజ్ ఫీచర్ నుంచి వైదొలగిన తర్వాత ముఖ్యమైన పోస్టులను యథాతథంగా చూడవచ్చని ఫేస్‌బుక్ ప్రతినిధి చెప్పారు.