‘ఫేక్‌’ బుక్‌ ఖాతాల్లో భారత్‌ టాప్‌! | Sakshi
Sakshi News home page

‘ఫేక్‌’ బుక్‌ ఖాతాల్లో భారత్‌ టాప్‌!

Published Mon, Feb 5 2018 3:04 AM

Facebook may have over 200 mn fake accounts - Sakshi

హైదరాబాద్‌: సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌లో దాదాపు 20 కోట్ల నకిలీ ఖాతాలున్నట్లు తేలింది. ఆ సంస్థ ప్రకటించిన 2017 డిసెంబర్‌ నాటి వార్షిక నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఈ నకిలీ ఖాతాలు అధికంగా భారత్‌లోనే ఉన్నట్లు పేర్కొంది. 2017 నాలుగో త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మంత్లీ ఆక్టివ్‌ యూజర్లు (ఎంఏయూ)లలో 10 శాతం నకిలీ ఖాతాలే అని అంచనా వేసింది.

అలాగే ఈ నకిలీ ఖాతాలున్న దేశాల్లో తొలి స్థానాల్లో భారత్, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్‌ ఉన్నట్లు పేర్కొంది. 2017 చివరి నాటికి మొత్తం 2.13 బిలియన్ల ఎంఏయూలు ఉన్నారని, 2016తో పోలిస్తే 14 శాతం ఎంఏయూలు పెరిగారంది. 2017లో ఖాతాలు పెరగడానికి భారత్, ఇండోనేసియా, వియత్నాం దేశాలే కారణమని పేర్కొంది. ఒక వాడకందారుడికి ఒకటి కంటే ఎక్కువ ఖాతాలుంటే.. అందులో మొదటి ఖాతా మినహా మిగతావన్నీ నకిలీవేనని పేర్కొంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement