ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని మావోయిస్టు తీవ్ర ప్రభావిత ప్రాంతం సుక్మా జిల్లాలో పెను ప్రమాదం తప్పింది.
భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
Jan 10 2017 2:32 PM | Updated on Sep 5 2017 12:55 AM
రాయిపూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని మావోయిస్టు తీవ్ర ప్రభావిత ప్రాంతం సుక్మా జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన పేలుడు పదార్థాలను పోలీసులు నిర్వీర్యం చేశారు. బెజ్జి నుంచి మంగళవారం ఉదయం సీఆర్‌పీఎఫ్, జిల్లా రిజర్వు పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.
భెజ్జి- ఇంజారం గ్రామాల మధ్య బెజ్జి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోని కల్వర్టు కింద ఉంచిన పేలుడు పదార్థాలను కనుగొన్నారు. అయితే, తక్కువ తీవ్రత కలిగిన వీటిని పోలీసు బలగాలే లక్ష్యంగా పెట్టి ఉంటారని సుక్మా ఎస్పీ ఇందిరా కల్యాణ్ ఎలిసెల తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో పోలీసుల కూంబింగ్ కొనసాగుతోందని వివరించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని అన్నారు.
Advertisement
Advertisement