మాజీలు బంగ్లాలను ఖాళీ చేయాల్సిందే | Ex-MPs Have To vacate official bungalows within a week | Sakshi
Sakshi News home page

మాజీలు బంగ్లాలను ఖాళీ చేయాల్సిందే

Aug 19 2019 10:32 PM | Updated on Aug 19 2019 10:32 PM

Ex-MPs Have To vacate official bungalows within a week - Sakshi

న్యూఢిల్లీ: మాజీ పార్లమెంట్‌ సభ్యులు ప్రభుత్వం కేటాయించిన బంగ్లాలను వారంలోగా ఖాళీ చేయాల్సిందిగా లోక్‌సభ హౌసింగ్‌ కమిటీ ఆదేశించింది. ఈ కమిటీకి సీఆర్‌ పాటిల్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. మాజీ ఎంపీలు తమకు కేటాయించిన బంగ్లాలు ఖాళీ చేయని పక్షంలో.. మూడు రోజుల్లో విద్యుత్తు, నీళ్లు, గ్యాస్‌ కనెక్షన్లు తొలగిస్తామని తెలిపింది. 2014లో ఎన్నికయిన పార్లమెంట్‌ సభ్యులకు ప్రభుత్వం ఢిల్లీలోని లూటీన్స్‌ బంగ్లాలను కేటాయించింది అధికార వర్గాల సమాచారం ప్రకారం 16వ లోక్‌సభ రద్దయినప్పటికీ దాదాపు 200మంది మాజీ ఎంపీలు ఇంకా వారికి కేటాయించిన బంగ్లాలను ఖాళీ చేయలేదు. 

అయితే, మాజీ ఎంపీలు బంగ్లాలు ఖాళీ చేయకపోవడం వల్ల కొత్తగా ఎన్నికయిన పార్లమెంట్‌ సభ్యులు తాత్కాలిక భవనాలలో ఉండాల్సి వస్తుంది. కాగా, మాజీ ఎంపీలు రాష్ట్ర అతిథి గృహాలలో నివసించాలని హౌసింగ్‌ కమిటీ సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement