‘తాగి మండలికి వస్తారేమో!’ | eshwarappa comments on congress in Legislative Council | Sakshi
Sakshi News home page

‘తాగి మండలికి వస్తారేమో!’

Mar 2 2016 1:25 PM | Updated on Sep 3 2017 6:51 PM

‘తాగి మండలికి వస్తారేమో!’

‘తాగి మండలికి వస్తారేమో!’

శాసనమండలి విపక్షనాయకుడు ఈశ్వరప్పను పిచ్చాసుపత్రిలో చేర్చాలని అధికార పక్షం ఎమ్మెల్సీ ఆర్వీ వెంకటేశ్ సభలో పేర్కొనడం గందరగోళానికి దారి తీసింది.

సాక్షి,బెంగళూరు:  శాసనమండలి విపక్షనాయకుడు ఈశ్వరప్పను పిచ్చాసుపత్రిలో చేర్చాలని అధికార పక్షం ఎమ్మెల్సీ ఆర్వీ వెంకటేశ్ సభలో పేర్కొనడం గందరగోళానికి దారి తీసింది. అయితే మండలి అధ్యక్షుడు శంకరమూర్తి కలుగజేసుకోవడంతో పరిస్థితి యథాస్థితికి వచ్చింది. వివరాలు...శాసనమండలిలో మంగళవారం సభా కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో కే.ఎస్ ఈశ్వరప్ప మాట్లాడటానికి ప్రయత్నించారు. ఆయన ప్రసంగానికి కాంగ్రెస్ నాయకులు పదేపదే అడ్డుతగులుతూ వచ్చారు. దీంతో కోపగించుకున్న కే.ఎస్ ఈశ్వరప్ప ‘ఇవరు కుడుదు సభకు బర్తారో ఏనో (వీరు తాగి మండలికి వస్తారో ఏమో?) అని’ అన్నారు. వెంటనే కలుగజేసుకున్న ఆర్వీ వెంకటేష్ ఈయన్ను (కే.ఎస్ ఈశ్వరప్ప)ను పిచ్చాసుపత్రిలో చేర్పించండి. ఎలా మాట్లాడాలో తెలియడం లేదన్నారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అధ్యక్షుడు శంకరమూర్తి కలుగజేసుకోని ఇరు పక్షాల సభ్యులకు సర్థి చెప్పడంతో పరిస్థితి యథాస్థితికి వచ్చింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement