‘భవిష్య’ చందాదారులకు మరింత వెసులుబాటు

EPFO to inform members about contributions not deposited by firms - Sakshi

న్యూఢిల్లీ: సంస్థలు తమ వాటాను భవిష్య నిధికి నిర్దిష్ట గడువులోగా జమ చేయకుంటే ఆ సమాచారం ఇకపై సదరు ఉద్యోగికి తెలుస్తుంది. ప్రస్తుతానికైతే కేవలం జమ చేసిన వివరాలనే ఎస్‌ఎంఎస్, ఈ–మెయిల్‌ ద్వారా భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) ఉద్యోగులకు పంపుతోంది. ‘ఇప్పటి వరకు సంస్థలు తమ వాటాను చెల్లించకుంటే ఆ సమాచారం ఆ ఉద్యోగులకు తెలిసేది కాదు.

ఎవరి తరఫున వారి సంస్థ కంట్రిబ్యూషన్‌ను చెల్లించలేదో ఇకపై ఆ వివరాలు సదరు ఉద్యోగికి ఈ–మెయిల్, ఎస్‌ఎంఎస్‌ ద్వారా పంపుతాము’ అని ఈపీఎఫ్‌వో బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ–మెయిల్‌ ఐడీ, మొబైల్‌ నెంబర్‌ను తమ సార్వత్రిక ఖాతా సంఖ్య(యూఎఎన్‌)తో అనుసంధానం చేసుకున్న వారికి ఈ వెసులుబాటు ఉంటుందని పేర్కొంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top