ఉద్యోగులకు తీపికబురు | EPFO Hikes Interest Rate On Provident Fund | Sakshi
Sakshi News home page

ఉద్యోగులకు తీపికబురు

Feb 21 2019 6:11 PM | Updated on Feb 21 2019 6:11 PM

EPFO Hikes Interest Rate On Provident Fund - Sakshi

వేతనజీవులకు ఈపీఎఫ్‌ఓ తీపికబురు

సాక్షి, న్యూఢిల్లీ : వేతన జీవులకు ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్‌ఓ) తీపికబురు అందించింది. ఈపీఎఫ్‌ఓ సబ్‌స్ర్కైబర్ల పీఎఫ్‌ ఖాతాలపై గత ఏడాది 8.55 శాతంగా ఉన్న వడ్డీరేటును 2018-19లో 8.65 శాతంగా నిర్ణయించింది. ఈపీఎఫ్‌ఓ నిర్ణయంతో ఆరు కోట్ల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుందని కార్మిక మంత్రి సంతోష్‌ గంగ్వర్‌ తెలిపారు.

పీఎఫ్‌పై వడ్డీరేటు పెంపును ఈపీఎఫ్‌ఓ సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ సభ్యులందరూ ఆమోదించారని చెప్పారు.బోర్డు నిర్ణయాన్ని కేబినెట్‌ ఆమోదం కొరకు పంపుతామని వెల్లడించారు.  2017-18లో పీఎఫ్‌పై వడ్డీ ఐదేళ్ల కనిష్టస్ధాయిలో 8.55 శాతం కాగా, 2016-17లో 8.65 శాతంగా ఉంది. 2015-16లో పీఎఫ్‌పై వడ్డీ రేటు 8.8 శాతం కావడం గమనార్హం. మరోవైపు 2013-14లో పీఎఫ్‌ వడ్డీరేటును ఈపీఎఫ్‌ఓ 8.75 శాతంగా నిర్ణయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement