పీఎం–జీకేవై పంపిణీ సజావుగా జరపాలి

Ensure smooth disbursal of PM-GKY money - Sakshi

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన(పీఎం–జీకేవై) మంజూరుచేసిన రూ.27,500 కోట్లను లబ్ధిదారులకు సజావుగా పంపిణీ అయ్యేలా చూడాలని కేంద్రం కోరింది. హోం శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు ఈ మేరకు లేఖ రాశారు. శుక్రవారం నుంచి బ్యాంకుల్లో మొదలయ్యే నగదు పంపిణీ సమయంలో ఎక్కువ సంఖ్యలో లబ్ధిదారులు గుమికూడకుండా వ్యక్తిగత దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అన్ని బ్యాంకుల శాఖలు, ఏటీఎంల వద్ద శాంతిభద్రతల నిర్వహణకు అవసరమైన భద్రతా సిబ్బందిని నియమించాలన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top