ఫైలిన్ తుపాన్కు మరో ఎనిమిది మంది బలి | Eight more killed in Odisha | Sakshi
Sakshi News home page

ఫైలిన్ తుపాన్కు మరో ఎనిమిది మంది బలి

Oct 13 2013 4:24 PM | Updated on Sep 1 2017 11:38 PM

ఫైలిత్ తుపాన్ ధాటికి మరో ఎనిమిదిమంది మరణించారు. ఒడిషాలోని గంజాం జిల్లాలో వీరి మృతదేహాలను ఆదివారం గుర్తించారు.

ఫైలిత్ తుపాన్ ధాటికి మరో ఎనిమిదిమంది మరణించారు. ఒడిషాలోని గంజాం జిల్లాలో వీరి మృతదేహాలను ఆదివారం గుర్తించారు. బరంపురం, పురుషోత్తంపూర్, గంజాం, రంగెలిలుండా ప్రాంతాల్లో ఇద్దరు చొప్పున చనిపోయారు. తుపాన్ ప్రభావానికి మరణించిన వారి సంఖ్య మొత్తం 15కు చేరింది. శనివారం ఏడుగురు మరణించారు.

ఒడిషాను కుదిపేసిన ఫైలిన్ విలయానికి గంజాం జిల్లాలో చాలా మంది గాయపడినట్టు సమాచారం. ఒడిషాతో పాటు ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా లోతట్టు ప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రదేశాలకు తరలించడం వల్ల ప్రాణ నష్టాన్ని తగ్గించగలిగారు. భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలుల ధాటికి రోడ్లు, రైల్వే లైన్లు, విద్యుత్, సమాచార వ్యవస్థుల దెబ్బతిన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement