అండమాన్ నికోబార్‌లో భూకంపం

పోర్ట్ బ్లేయర్: అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. నికోబార్ ద్వీపాల్లో బుధవారం మధ్యాహ్నం సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 4.6గా నమోదయినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. బుధవారం మధ్యాహ్నం 2.49గంటల సమయంలో నికోబార్ ప్రాంతంలో భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. అలానే గుజరాత్ కచ్ ప్రాంతంలో సోమవారం భూకంపం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని పేర్కొన్నారు. కచ్ జిల్లాలోని భచావుకు 6 కిలోమీటర్ల వాయువ్య దిశలో సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు భూకంపం సంభవించిందని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సీస్మోలాజికల్ రీసెర్చ్ అధికారులు తెలిపారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి