
అవినీతి ఆరోపణలపై సచిన్ స్పందించాడు!
డీఆర్డీవోకు చెందిన ఇనిస్టిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్ మెంట్ వద్ద ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని నిషేధం ఉంది.
డీఆర్డీవోకు చెందిన ఇనిస్టిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్ మెంట్ వద్ద ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని నిషేధం ఉంది. అక్కడ రిసార్ట్ నిర్మించడంపై డీఆర్డీవో ఎస్టేట్ అధికారి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సీబీఐ డిపార్ట్ మెంట్లకు ఫిర్యాదుచేశారు. కంటోన్మెంట్ ఏరియాలో ఉన్న ఆక్రమిత స్థలాలు, అక్రమ నిర్మాణాలను ఆదర్శ్ కుంభకోణం కంటే చాలా పెద్దదని ఎస్టేట్ ఆఫీసర్ ఆరోపించారు. ఉత్తరాఖండ్ లోని ముస్సోరిలో డీఆర్డీవో స్థలాన్ని ఆక్రమించి సచిన్ వ్యాపార భాగస్వామి రిసార్ట్ కట్టారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సంజయ్ నారంగ్ మీడియాతో మాట్లాడుతూ... మాకు సంబంధించిన నిర్మాణాలు, ఆస్తులలో అవినీతి లేదు. అన్నీ చట్టపరంగా నిర్మించినవేననీ, కంటోన్మెంట్ ఏరియాలో ఉన్న పాత బిల్డింగ్ లకు మాత్రమే మరమ్మతులు చేశామని పేర్కొన్నాడు. కంప్లైంట్ గురించి తనకేం తెలియదని, తన దృష్టికి రాలేదని చెప్పాడు. సచిన్ మిత్రుడు నారంగ్ కు చెందిన దాలియా బ్యాంకు, ఇతర ఆస్తులపై జూలై 6న ఓ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.
నారంగ్ నా పార్ట్నర్ కాదు: సచిన్
పారికర్ ను కలిసిన అనంతరం సచిన్ మీడియాతో మాట్లాడాడు. రక్షణశాఖకు రాతపూర్వక సమాధానం ఇవ్వడానికి వచ్చాను. నారంగ్కు చెందిన ముస్సోరిలోని ల్యాండర్ విషయాలపై వివరణ ఇచ్చినట్లు చెప్పాడు. ప్రస్తుతం నారంగ్ తో తనకెలాంటి వ్యాపార సంబంధాలు లేవని, ల్యాండర్ రెసిడెన్సీలో మాత్రమే బస చేసేవాడినని సచిన్ తెలిపాడు. ఆర్థిక లావాదేవిలకు సంబంధించి చర్చించలేదని సచిన్ వ్యక్తిగత కార్యదర్శి వెల్లడించాడు.