resort construction
-
అవినీతి ఆరోపణలపై సచిన్ స్పందించాడు!
డీఆర్డీవోకు చెందిన ఇనిస్టిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్ మెంట్ వద్ద ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని నిషేధం ఉంది. అక్కడ రిసార్ట్ నిర్మించడంపై డీఆర్డీవో ఎస్టేట్ అధికారి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సీబీఐ డిపార్ట్ మెంట్లకు ఫిర్యాదుచేశారు. కంటోన్మెంట్ ఏరియాలో ఉన్న ఆక్రమిత స్థలాలు, అక్రమ నిర్మాణాలను ఆదర్శ్ కుంభకోణం కంటే చాలా పెద్దదని ఎస్టేట్ ఆఫీసర్ ఆరోపించారు. ఉత్తరాఖండ్ లోని ముస్సోరిలో డీఆర్డీవో స్థలాన్ని ఆక్రమించి సచిన్ వ్యాపార భాగస్వామి రిసార్ట్ కట్టారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సంజయ్ నారంగ్ మీడియాతో మాట్లాడుతూ... మాకు సంబంధించిన నిర్మాణాలు, ఆస్తులలో అవినీతి లేదు. అన్నీ చట్టపరంగా నిర్మించినవేననీ, కంటోన్మెంట్ ఏరియాలో ఉన్న పాత బిల్డింగ్ లకు మాత్రమే మరమ్మతులు చేశామని పేర్కొన్నాడు. కంప్లైంట్ గురించి తనకేం తెలియదని, తన దృష్టికి రాలేదని చెప్పాడు. సచిన్ మిత్రుడు నారంగ్ కు చెందిన దాలియా బ్యాంకు, ఇతర ఆస్తులపై జూలై 6న ఓ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. నారంగ్ నా పార్ట్నర్ కాదు: సచిన్ పారికర్ ను కలిసిన అనంతరం సచిన్ మీడియాతో మాట్లాడాడు. రక్షణశాఖకు రాతపూర్వక సమాధానం ఇవ్వడానికి వచ్చాను. నారంగ్‌కు చెందిన ముస్సోరిలోని ల్యాండర్ విషయాలపై వివరణ ఇచ్చినట్లు చెప్పాడు. ప్రస్తుతం నారంగ్ తో తనకెలాంటి వ్యాపార సంబంధాలు లేవని, ల్యాండర్ రెసిడెన్సీలో మాత్రమే బస చేసేవాడినని సచిన్ తెలిపాడు. ఆర్థిక లావాదేవిలకు సంబంధించి చర్చించలేదని సచిన్ వ్యక్తిగత కార్యదర్శి వెల్లడించాడు. -
మరో వివాదంలో క్రికెట్ దేవుడు!
న్యూఢిల్లీ: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. భారతరత్న పురస్కారాన్ని దుర్వినియోగం చేశారనే అరోపణలతో వీకే నస్వా అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టేసింది. అయితే తాజాగా ఉత్తరాఖండ్ లోని ముస్సోరిలో డీఆర్డీవో స్థలాన్ని ఆక్రమించి సచిన్ వ్యాపార భాగస్వామి రిసార్ట్ కట్టారని ఆరోపణలొచ్చాయి. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్‌ను రాజ్యసభ సభ్యుడైన సచిన్ కోరారు. సమ్మర్ క్యాంపు కోసం ఏర్పాటు చేసుకున్న రిసార్టులో 50 అడుగుల స్థలంపై వివాదం తలెత్తింది. డీఆర్డీవోకు చెందిన ఇనిస్టిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్ మెంట్ వద్ద ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని నిషేధం ఉంది. అయినా అక్కడ ఓ రిసార్ట్ నిర్మించారు. వాస్తవానికి ఆ వేసవి విడిది (రిసార్ట్) ఓనర్ సచిన్ వ్యాపార భాగస్వామి సంజయ్ నారంగ్. అయితే ఈ వివాదంలో జోక్యం చేసుకునేందుకు మనోహర్ పారికర్ సుముఖంగా ఉన్నట్లు కనిపించడం లేదు. రక్షణశాఖకు సంబంధించిన అంశం కావడంతో.. కేవలం పారికర్ మాత్రమే తనను ఈ వివాదం నుంచి బయట పడేయగలరని సచిన్ భావిస్తున్నారట. ఇప్పటివరకూ ఈ రిసార్ట్ కు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇనిస్టిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్ మెంట్ కథనం ప్రకారం.. తొలుత ఇక్కడ కేవలం ఓ టెన్నిస్ కోర్టును నిర్మించుకునేందుకు నారంగ్ అనుమతి తీసుకున్నారు. ఆ తర్వాత సకల సౌకర్యాలతో వసతులు ఏర్పాటుచేసుకున్నారని ఆరోపిస్తున్నారు. గతనెలలో ఈ విషయంపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సీబీఐలకు కూడా ఫిర్యాదులు వెళ్లాయి. మరోవైపు ఈ వివాదంపై ఎన్నో ఆరోపణలు వెల్లువెత్తుతున్నా సచిన్, సంజయ్ నారంగ్ మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.