
గువాహటి నగర జంతువుగా డాల్ఫిన్
అస్సాం రాజధాని గువాహటికి మస్కట్‌గా గంగానది డాల్ఫిన్‌ను ఎంపిక చేశారు. ఒక పట్టణానికి ప్రత్యేకంగా జంతువును ప్రకటించడం ఇదే తొలిసారి.
గువాహటి: అస్సాం రాజధాని గువాహటికి మస్కట్‌గా గంగానది డాల్ఫిన్‌ను ఎంపిక చేశారు. ఒక పట్టణానికి ప్రత్యేకంగా జంతువును ప్రకటించడం ఇదే తొలిసారి. అంతరించడానికి చేరువగా ఉన్న డాల్ఫిన్‌తో పాటు బోర్ కాసో(నలుపు తాబేలు రకం), హార్గిలా( కొంగ రకం) మధ్య ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో పోటీ నిర్వహించి డాల్ఫిన్‌ను ఎంపికచేసినట్లు కామరూప్ మెట్రోపాలిటన్ డిప్యూటీ కమిషనర్ ఎం.అంగముత్తు తెలిపారు.