డాక్టరంటే అతడే..!

Doctor carries woman on cot for 8 km in Odisha - Sakshi

సాక్షి, మల్కన్‌గిరి (ఒడిశా): మానవత్వానికి పరీక్షగా ఒడిశా మారింది. మంచాల మీద గర్భవతులును, భుజాల మీద మృతదేహాలను మోసుకెళ్లడం ఈ ప్రాంతంలో అత్యంత సహజంగా మారింది. ఇక్కడి గిరిపుత్రులకు రహదారి వంటి కనీస మౌలిక సౌకర్యాలుకూడా అందుబాటులేవు అని చెప్పే మరో ఘటన ఇది.

మల్కన్‌గిరి జిల్లాలోని సరిగెట గ్రామం. విద్య, వైద్యం, రహదారి వంటి కనీస సౌకర్యాలు కూడా లేని గ్రామం. ఆ గ్రమంలో ఒక గర్భిణికి నెలలు పూర్తయ్యాయి. సరిగెట గ్రామంలో వైద్య విధులు నిర్వహించేందుకు కొత్తగా చేరనిన వైద్యుడు ఆమెకు సుఖ ప్రసవం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కడుపులో బిడ్డ అడ్డం తిరగడంతో.. తల్లీబిడ్డ ఇద్దరికి ప్రమాదం అని తెలిసి సమీపంలో ఉన్న పెద్దాసుపత్రికి ఆమెను తరిలించాని సూచించారు. అయితే రహదారి సౌకర్యం లేకపోవడంతో.. నెలలు నిండిన గర్భిణిని యువకుడైన వైద్యుడు, ఆమె భర్త, మంచంతో సహా 8 కిలోమీటర్లు మోసుకెళ్లి ఆసుపత్రిలో చేర్చారు.

ఈ ప్రయాణంలో ఆమెకు విపరీతమైన రక్తస్రావం జరిగింది. అయితే ఆలస‍్యం చేయకుండా ఆమెను ఆసుపత్రికి తరిలించడంతో.. ముగ్గురు వైద్యులు కలిసి ఆమెకు ప్రసవం చేశారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top