'స్వచ్ఛ భారత్‌కు ఎంపీల్యాడ్ వద్దు' | do not want MP LADS for swacha bharath | Sakshi
Sakshi News home page

'స్వచ్ఛ భారత్‌కు ఎంపీల్యాడ్ వద్దు'

Apr 30 2015 1:57 AM | Updated on Sep 3 2017 1:07 AM

స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి(ఎంపీల్యాడ్) నిధుల వాడాలన్న యోచనను బుధవారం లోక్‌సభలో విపక్షాలు వ్యతిరేకించాయి.

న్యూఢిల్లీ: స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి(ఎంపీల్యాడ్) నిధుల వాడాలన్న యోచనను బుధవారం లోక్‌సభలో విపక్షాలు  వ్యతిరేకించాయి. స్వచ్ఛ భారత్‌కు ఈ నిధులను వాడే అంశంపై సభ చర్చించాలని పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు సూచించగా జ్యోతిరాదిత్య, కేసీ వేణుగోపాల్(కాంగ్రెస్)తోపాటు పలు విపక్షాల సభ్యులు నిరసన తెలిపారు. ఇలాంటి యత్నానికి అంగీకరించబోమన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement