క్షమాభిక్ష పిటిషన్లను సుదీర్ఘకాలం పెండింగ్‌లో ఉంచకూడదని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ పి.సదాశివం పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు తీర్పునకు సీజేఐ సమర్థన
ముంబై: క్షమాభిక్ష పిటిషన్లను సుదీర్ఘకాలం పెండింగ్‌లో ఉంచకూడదని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ పి.సదాశివం పేర్కొన్నారు. క్షమాభిక్ష పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో అనుచిత, అసాధారణ జాప్యం జరిగితే మరణశిక్షను జీవితఖైదుగా మార్చవచ్చన్నారు. ఈ మేరకు ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఆయన సమర్థించారు. అయితే దీన్ని హేయమైన నేరాలకు పాల్పడిన వారిపై కోర్టు కనికరం చూపుతున్నట్లు అర్థం చేసుకోకూడదన్నారు.
శనివారమిక్కడ ‘నేర దర్యాప్తు మెరుగుదల’పై నిర్వహించిన సదస్సులో జస్టిస్ సదాశివం మాట్లాడారు. మరోపక్క.. దేశంలో వివిధ కోర్టుల్లో 3.1 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉండడం తనకు తీవ్రఆందోళన కలిగిస్తోందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముంబైలో జరిగిన మరో కార్యక్రమంలో అన్నారు.