
రాఘవా లారెన్స్ (ఫైల్ ఫొటో)
కేరళ వరద బాధితులను ఆదుకోవడానికి రాఘవా లారెన్స్ ముందుకొచ్చారు.
సాక్షి, చెన్నై : ప్రకృతి విలయానికి తీవ్రంగా నష్టపోయిన కేరళ వరద బాధితులకు విరాళం అందించేందుకు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా విశేష స్పందన వస్తోంది. బాధితులకు ఆపన్నహస్తం అందించేందుకు ఇప్పటికే రాజకీయ, సినీ ప్రముఖులెందరో ముందుకొచ్చారు. తమ వంతు సాయం ప్రకటించారు. తాజాగా తమిళ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవా లారెన్స్ ఈ జాబితాలో చేరారు. వరద బాధితుల సహాయార్ధం ఆయన కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. కేరళ సీఎం సహాయనిధికి ఆ మొత్తాన్ని అందించారు.