మోదీపై దినకరన్‌ అభ్యంతరకర వ్యాఖ్యలు

Dhinakaran Warns Neither Modi Nor His Daddy Can Save AIADMK   - Sakshi

చెన్నై : తమిళనాడులో పాలక ఏఐఏడీఎంకేను ప్రధాని నరేంద్ర మోదీయే కాదు ఆయన తండ్రి కూడా కాపాడలేరని ఆ పార్టీ బహిష్కృత నేత టీటీవీ దినకరన్‌ పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ఏఐఏడీఎంకేతో బీజేపీ పొత్తు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీయే తండ్రి తరహాలో ఆ పార్టీకి మార్గదర్శకత్వం వహిస్తున్నారని ఆరోపించారు.

కాగా దినకరన్‌ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు 17 మం‍దిపై తమిళనాడు స్పీకర్‌ తీసుకున్న వేటు నిర్ణయాన్ని మద్రాస్‌ హైకోర్టు సమర్ధించడంతో ఈ నియోజకవర్గాల్లో ఏప్రిల్‌ 18న ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికలు పళనిస్వామి నేతృత్వంలోని ఏఐఏడీఎంకే ప్రభుత్వానికి సవాల్‌గా మారాయి. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఈ 17 నియోజకవర్గాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఏడీఎంకేకు దారుణ పరాజయం ఎదురైతే ఆ పార్టీని ఎవరూ కాపాడలేరని ఏఎంఎంకే పేరుతో సొంత పార్టీని ఏర్పాటు చేసిన దినకరన్‌ పేర్కొన్నారు. మరోవైపు డీఎంకే దిగ్గజ నేత ఎం కరుణానిధి మరణంతో ఖాళీ అయిన తిరువూర్‌ అసెంబ్లీ స్ధానంలోనూ 18న పోలింగ్‌ నిర్వహిస్తారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top