ఆన్‌లైన్‌లో ఔషధాల  అమ్మకాలకు బ్రేక్‌ 

The Delhi High Court has issued  to stop selling drugs and drugs online - Sakshi

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌లో ఔషధాలు, మందుల అమ్మకాలను నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. మందుల ఆన్‌లైన్‌ అమ్మకాలపై నిషేధం విధించాలని దాఖలైన పిటిషన్‌ను విచారించిన  ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. విచారణ సందర్భంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదిస్తూ..‘ఆన్‌లైన్‌ అమ్మకాల కారణంగా ఔషధాలు దుర్వినియోగమయ్యే అవకాశముంది. నకిలీల బెడదతో సతమతవుతున్న ఈ–కామర్స్‌ సైట్లలో నాణ్యతలేని, కల్తీ మందులు సరఫరా అయితే రోగి ప్రాణానికే ప్రమాదం’ అని తెలిపారు. దీంతో ఈ విషయంలో అభిప్రాయాన్ని తెలియజేయాలని కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ(సీడీఎస్‌సీవో), ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు కోర్టు నోటీసులు జారీచేసింది.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top