తబ్లిగీ కేసులు అనడంపై అభ్యంతరం

Delhi HC seeks to restrain authorities from separately classifying Markaz COVID-19 - Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్‌–19 కారణంగా మరణించిన కొన్ని కేసులను తబ్లిగీ జమాత్, మసీదు, మర్కజ్‌ కేసులుగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వర్ణించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్‌ దాఖలైంది. ఈ మాటలు వాడకుండా ఢిల్లీ ముఖ్యమంత్రిని తక్షణం నియంత్రించాలని లాయర్లు ఫోజియా రహమాన్, ఖయ్యాముద్దీన్‌ల ద్వారా ఎం.ఎం.కశ్యప్‌ అనే న్యాయవాది పిటిషన్‌ను దాఖలు చేశారు. మార్చిలో ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో తబ్లిగీ జమాత్‌ జరిగిన తర్వాత కేజ్రీవాల్‌ ట్విట్టర్‌లో ఉద్దేశపూర్వకంగానే పలు కోవిడ్‌ కేసులను మసీదు మర్కజ్‌ కేసులుగా పేర్కొన్నారని ఆరోపించారు. సీఎం కేజ్రీవాల్‌ వ్యాఖ్యలతో సమాజంలో ఒక మతం పట్ల వ్యతిరేకత, ద్వేషం పెరిగిందన్నారు. ఈ పిటిషన్‌ 20న విచారణకు రానుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top