లిఫ్టుల ఏర్పాటు ఈజీ | Delhi Development Authority Liberalises Freehold Policy in Building Plan Absence Cases | Sakshi
Sakshi News home page

లిఫ్టుల ఏర్పాటు ఈజీ

Sep 19 2014 10:39 PM | Updated on Sep 2 2017 1:39 PM

లిఫ్టుల ఏర్పాటు ఈజీ

లిఫ్టుల ఏర్పాటు ఈజీ

ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) నిర్మించిన ఫ్లాట్లలో లిఫ్టుల ఏర్పాటు సులభతరంగా మారింది.

అఫిడవిట్ దాఖలును రద్దుచేసిన డీడీఏ
డీడీఏ నిర్మించిన ఫ్లాట్లలో నివసిస్తున్నవారికి శుభవార్త. ఈ భవనాల్లో అవసరమని భావించినవారు లిఫ్టులను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందుకోసం డీడీఏ నుంచి ఎటువంటి అనుమతి పొందాల్సిన అవసరమే లేదు.
 
న్యూఢిల్లీ: ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) నిర్మించిన ఫ్లాట్లలో లిఫ్టుల ఏర్పాటు సులభతరంగా మారింది. ఇందుకోసం ఈ సంస్థకు ఇకమీదట ఎటువంటి అఫిడవిట్‌నూ దాఖలు చేయాల్సిన అవసరమే లేదు. ఆయా ఫ్లాట్లలో ఏమైనా మార్పులుచేర్పులను చేపట్టాలంటే ముందుగా డీడీఏకి ఓ అఫిడవిట్‌ను విధిగా దాఖలు చే యాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనను డీడీఏ రద్దు చేసింది. దీంతో లిఫ్టు ఏర్పాటుకు ఎటువంటి ఆటంకాలు ఎదురుకాబోవు. లిఫ్టుల ఏర్పాటుకు సంబంధించి ఈ నిబంధన అవరోధంగా పరిణమించింది.

దీంతో గత కొన్ని నెలలుగా అనేక రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు సంబంధిత అధికారులను కలిసి వినతిపత్రాలను సమర్పించారు. అంతేకాకుండా ఈ నిబంధనను రద్దు చేయాలంటూ పట్టణ అభివృద్ధి శాఖకు లేఖలు రాశారు. ఆది నుంచి ఈ నిబంధన ఆటంకంగా పరిణమించినందువల్ల గతంలో నిర్మించిన భవనాల్లో లిఫ్టుల ఏర్పాటు సాధ్యం కాలేదంటూ వాదించాయి. ఈ విషయంలో సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించారని ఆరోపించాయి. లిఫ్టులకు సంబంధించిన విధానాన్ని డీడీఏ గతంలో అనేక పర్యాయాలు మార్పులుచేర్పులు చేసింది. చివరిగా ఈ నెల ఒకటో తేదీన కూడా సవరణలు చేసింది. లిఫ్టులను ఏర్పాటు చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) పొందాల్సిందేనని పేర్కొంది.

ఈ విషయమై డీడీఏ ఉపాధ్యక్షుడు బల్వీందర్‌కుమార్ మాట్లాడుతూ ఫ్లాట్లలో నివసించేవారికి అనుగుణంగా నిబంధనల్లో మార్పులుచేర్పులు చేస్తున్నామన్నారు. అనధికార నిర్మాణాలనేది మరొక అంశమని, దానిని దీనితో ముడిపెట్టలేమని అన్నారు. తాము నిర్మించిన ఫ్లాట్లలో నివసించేవారికి సంబంధించి ఏ ప్రక్రియ అయినా సులభతరంగా ఉండేవిధంగా చేయాలనేదే తమ ఉద్దేశమన్నారు. ఈ నిబంధన ఎత్తివేతకు మరేదైనా కారణం ఉందా అని ప్రశ్నించగా అటువంటిదేమీ లేదన్నారు. ఈ విషయమై అనేక పర్యాయాలు అయా ఫ్లాట్లలో నివసించేవారితో సంప్రదింపులు కూడా జరిపామన్నారు. కాగా లిఫ్టుల ఏర్పాటులో ఆంక్షల రద్దు వల్ల దాదాపు నాలుగు లక్షలమంది లబ్ధి పొందనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement