సైకిల్పై డిప్యూటీ సీఎం పయనం | Sakshi
Sakshi News home page

సైకిల్పై డిప్యూటీ సీఎం పయనం

Published Sat, Jan 2 2016 3:07 PM

సైకిల్పై డిప్యూటీ సీఎం పయనం

న్యూఢిల్లీ: కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం అమలు చేస్తున్న సరి-బేసి నిబంధనకు మంచి స్పందన వస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా ఆయన మంత్రివర్గ సభ్యులు, ఆప్ నేతలు ఈ నిబంధనను అనుసరిస్తున్నారు. కొందరు కార్లను పక్కనబెట్టి సైకిల్, ఆటోలు, బస్సుల్లో ఆఫీసుకు వెళ్లారు. జనవరి 1 నుంచి అమలు చేస్తున్న సరి-బేసి రూల్ ప్రకారం ఢిల్లీలో శనివారం సరి వాహనాలను రోడ్లపైకి అనుమతించారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సైకిల్ ఎక్కారు. ఢిల్లీలోని ఆలిండియా రేడియో స్టేషన్ ఆఫీసు నుంచి  సచివాలయానికి సిసోడియా సైకిల్పై వెళ్లారు.

శుక్రవారం ఢిల్లీ ఆప్ కన్వీనర్ దిలీప్ పాండే ఆటోలో ఆఫీసుకు వెళ్లారు. సీఎం కేజ్రీవాల్.. రవాణా మంత్రి గోపా ల్‌రాయ్ కారులో సచివాలయానికి వెళ్లారు. సీఎం, గోపాల్‌రాయ్, పీడబ్ల్యూడీ మంత్రి ఒకే కారులో ప్రయాణించారు.

Advertisement
Advertisement