నిర్భయ దోషులకు మరోసారి డెత్ వారెంట్లు జారీ

సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయ అత్యాచార కేసులో దోషులకు ఢిల్లీ పటియాల హౌస్‌కోర్టు కొత్త డెత్‌వారెంట్లు జారీచేసింది. మార్చి 20న ఉదయం 5.30 నిమిషాలకు నలుగురు దోషులను ఉరితీయాలని కోర్టు ఆదేశించింది. తీహార్ జైల్లో దోషులను ఉరితీయానున్నారు. కాగా ఈ విధంగా డెత్‌వారెంట్లు జారీచేయడం ఇది నాలుగోసారి. గత మూడుసార్లు దోషులను కోర్టులను ఆశ్రయించడంతో ఉరితీత వాయిదా పడిన విషయం తెలిసిందే. నిజానికి, ట్రయల్ కోర్టు ఫిబ్రవరి 17న జారీ చేసిన డెత్ వారెంట్ ప్రకారం.. నిర్భయ దోషులు నలుగురినీ మార్చి 3 ఉదయం ఆరు గంటలకు ఉరితీయాల్సి ఉంది. నలుగురు దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా రాష్ట్రపతి ముందు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ పరిశీలనలో ఉండడంతో తదుపరి ఆదేశాలిచ్చే వరకు ఉరిశిక్షను నిలిపివేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశించడంతో శిక్షను నిలిపివేశారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి