వైరల్: అచ్చం సినిమాలా! | Delhi Cops Dramatic Rescue For Couple From Fire | Sakshi
Sakshi News home page

Aug 22 2018 3:39 PM | Updated on Sep 5 2018 9:47 PM

Delhi Cops Dramatic Rescue For Couple From Fire - Sakshi

అచ్చం సినిమా యాక్షన్‌ సీన్‌ను తలపించేలా యువజంటను సురక్షితంగా కాపాడారు.

సాక్షి, న్యూఢిల్లీ: నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా సినిమాలు తెరకెక్కించడం సులువే. కానీ సినిమాలోని యాక్షన్‌ సీన్స్‌ మాత్రం నిజజీవితంలో సాధ్యం కాదంటే పొరపాటే. ఢిల్లీ పోలీసులు అచ్చం సినిమా యాక్షన్‌ సీన్‌ను తలపించేలా యువజంటను కాపాడారు. ఇప్పుడా పోలీసుల రెస్య్కూ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. పోలీసుల ధైర్య సాహసాలను ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు. 

అసలేం జరిగిందంటే..
అత్యంత రద్దీగా ఉండే సెంట్రల్‌ ఢిల్లీ దగ్గర్లోని పాహర్‌గంజ్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌ రెండో అంతస్తులో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఆ అపార్టుమెంట్‌లో ఉండే యువజంట ప్రాణాలు కాపాడుకోవడానికై పైనుంచి దూకే ప్రయత్నం చేశారు. కానీ బాల్కనీలో చిక్కుకొని వేలాడుతూ ఉండటంతో రక్షించండంటూ కేకలు వేశారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నాలుగో అంతస్తు నుంచి చిన్న నిచ్చెన వేసుకొని, చైన్‌లా ఏర్పడి.. అత్యంత ధైర్యసాహసాలతో వారిని సురక్షితంగా కాపాడారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది. 

Advertisement
 
Advertisement
Advertisement