'నా భర్త జైలుకెళితే ప్రాణాలకు ముప్పు' | Death threat to my husband, if he goes to jail, claims his wife vasantha | Sakshi
Sakshi News home page

'నా భర్త జైలుకెళితే ప్రాణాలకు ముప్పు'

Dec 24 2015 6:26 PM | Updated on Sep 3 2017 2:31 PM

'నా భర్త జైలుకెళితే ప్రాణాలకు ముప్పు'

'నా భర్త జైలుకెళితే ప్రాణాలకు ముప్పు'

తన భర్తకు తీవ్ర అనారోగ్యంగా ఉందనీ, జైలుకెళితే ప్రాణాలకు ముప్పుంటూ ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబా భార్య వసంత కోర్టుకు విన్నవించింది.

ఢిల్లీ:  తన భర్తకు తీవ్ర అనారోగ్యంగా ఉందనీ, జైలుకెళితే ప్రాణాలకు ముప్పుంటూ ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబా భార్య వసంత కోర్టుకు విన్నవించింది. 90 శాతం అనారోగ్యం, అంగవైకల్యంతో తన భర్త బాధపడుతున్నారంటూ ఆమె వాపోయింది. బెయిల్ ఇవ్వండి, అవసరమైతే గృహ నిర్బంధంలో ఉంచండి'' అంటూ వసంత కోరింది. నిషిద్ధ మావోయిస్టు పార్టీతో సంబంధాలున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో గత ఏడాది ఢిల్లీలో సాయిబాబాను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

అప్పటినుంచి నాగాపూర్ జైల్లో ఉన్న సాయిబాబాకు గతంలో బాంబే హైకోర్టు అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మానవతా దృక్పథంతో తాత్కాలిక బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.  ఈ కేసు నేపథ్యంలో ఢిల్లీ యూనివర్సిటీ ఆయనను అప్పుడే విధుల నుంచి సస్పెండ్ చేసింది. కాగా, ఈ కేసును పరిశీలించిన నాగాపూర్ హైకోర్టు బెంచ్ నిన్న మధ్యంతర బెయిల్ రద్దు చేసినట్టు వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement