ప్రమాద స్థలికి 100 కి.మీ దూరంలో మృతదేహం | deadbody found at a distance of 100 km from the accident spot | Sakshi
Sakshi News home page

ప్రమాద స్థలికి 100 కి.మీ దూరంలో మృతదేహం

Aug 4 2016 11:35 AM | Updated on Sep 4 2017 7:50 AM

ప్రమాద స్థలికి 100 కి.మీ దూరంలో మృతదేహం

ప్రమాద స్థలికి 100 కి.మీ దూరంలో మృతదేహం

ప్రమాద స్థలికి 100 కిలోమీటర్ల దూరంలో ఓ బస్సు డ్రైవర్ మృతదేహం గుర్తించారు.

ముంబై: ముంబై-గోవా హైవేలో సావిత్రి నదిపై వంతెన కూలిన ఘటనలో మరో మృతదేహం లభ్యమైంది. ఘటనా స్థలికి 100 కిలోమీటర్ల దూరంలో ఓ బస్సు డ్రైవర్ మృతదేహం గుర్తించారు. మంగళవారం అర్థరాత్రి సమయంలో వంతెన కూలిపోవటంతో నాలుగు బస్సులు, రెండు కార్లు గ్లల్లంతైన విషయం తెలిసిందే. గల్లంతైన వాహనాలను గుర్తించేందుకు 300 కేజీల మాగ్నెట్ సహాయంతో గాలిస్తున్నారు.

సహాయక చర్యల్లో నేవీ గజ ఈతగాళ్లు పాల్గోంటున్నారు. ఈ ఘటనలో మొత్తం 22 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే.. రాత్రి వేళలో వంతెన కొట్టుకుపోవడంతో హైవేపై వెళ్తున్న వారు ఎంత మంది నదిలో పడిపోయారనే విషయం స్పష్టంగా తెలియటం లేదు. ఇప్పటి వరకు ముగ్గురి మృతదేహాలు లభించాయి. కూలిన బ్రిడ్జి 1928లో నిర్మించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement