రిసార్టులో పార్టీ.. ఆరుగురు అరెస్ట్‌ | Dance Party At Resort Cops Arrest Six Persons In Kerela | Sakshi
Sakshi News home page

రిసార్టు పార్టీలో 300 మంది.. ఆరుగురు అరెస్ట్

Jul 9 2020 11:51 AM | Updated on Jul 9 2020 12:33 PM

Dance Party At Resort Cops Arrest Six Persons In Kerela - Sakshi

తిరువ‌నంత‌పురం: క‌రోనా విజృంభిస్తున్నా కొంద‌రు మాత్రం నిబంధ‌న‌ల్ని గాలికొదిలేస్తున్నారు. ఓ రిసార్టులో జ‌రిగిన పార్టీకి ఏకంగా 300 మంది హాజ‌రైన ఘ‌ట‌న కేర‌ళ‌లోని హిల్లీ జిల్లా ఉదుంబంచోలలో చోటుచేసుకుంది. ఇష్టారాజ్యంగా చిందులేస్తూ ఆ వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో ఈ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. దీంతో రిసార్టు మేనేజ‌ర్ స‌హా ఆరుగురిని అరెస్ట్ చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు.  

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఓ ప్రైవేట్ కంపెనీ ప్రారంభోత్సవం సందర్భంగా జూన్ 29న రిసార్టులో గ్రాండ్‌గా పార్టీ నిర్వ‌హించారు. అంతేకాకుండా పార్టీలో చిందులేయ‌డానికి బెంగుళూరు, ఎర్నాకులం స‌హా ఉక్రెయిన్ నుంచి డ్యాన్స‌ర్ల‌ని రప్పించిన‌ట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో జూలై  3న వీరిపై కేసు న‌మోదైంది. ఇప్ప‌టికే రిస్టార్ట్ మేనేజ‌ర్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు కొన‌సాగుతోంద‌ని తెలిపారు. (బీజేపీ నేత కుటుంబంపై ముష్కరుల కాల్పులు )


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement