నీళ్లు తోడుకున్నాడని... | Dalit shot at for fetching water from govt tubewell | Sakshi
Sakshi News home page

నీళ్లు తోడుకున్నాడని...

Jun 6 2016 8:13 PM | Updated on Aug 25 2018 4:14 PM

ప్రభుత్వ చేతిపంపు నుంచి నీళ్లు తోడుకున్న దళిత యువకుడిపై కాల్పులు జరిపారు.

బదోహీ: ప్రభుత్వ  చేతిపంపు నుంచి నీళ్లు తోడుకున్న దళిత యువకుడిపై కాల్పులు జరిపారు. ఉత్తరప్రదేశ్ లోని బదోహి జిల్లా ఆమ్వాలో ఆదివారం పంకజ్‌ ధాయ్‌కర్ నీళ్లు తోడుతుండగా కైలాస్ అనే వ్యక్తి అడ్డుకున్నాడు. ఇరువర్గాలు రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నాయి. పాథక్ తుపాకీతో ధాయ్‌కర్‌పై కాల్పులు జరిపి పారిపోయాడు. ధాయ్‌కర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

అతడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘర్షణకు బాధ్యులై వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement