12న సీడబ్ల్యూసీ భేటీ | cwc meet on march 12 in ahmedabad | Sakshi
Sakshi News home page

12న సీడబ్ల్యూసీ భేటీ

Mar 10 2019 4:29 AM | Updated on Mar 18 2019 7:55 PM

cwc meet on march 12 in ahmedabad - Sakshi

అహ్మదాబాద్‌: కాంగ్రెస్‌ అత్యున్నత నిర్ణాయక విభాగమైన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం 12న అహ్మదాబాద్‌లో జరగనుంది. రానున్న లోక్‌సభ ఎన్నికల ప్రచారం, వ్యూహాలను చర్చించనున్నారు. భేటీ అనంతరం గాంధీనగర్‌లోని అదాలజ్‌లో బహిరంగ సభ ఉంటుంది. 1961లో తొలిసారిగా గుజరాత్‌లో సీడబ్ల్యూసీ భేటీ జరిగింది. తిరిగి 58 ఏళ్ల తర్వాత ఈ కార్యక్రమానికి అహ్మదాబాద్‌ వేదిక కాబోతోంది. ఈ భేటీకి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఆయన తల్లి సోనియా, మాజీ ప్రధాని మన్మోహన్‌లతోపాటు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement