మోదీ ఫోటోతో గోల్డ్‌, సిల్వర్‌ బిస్కెట్లు.. | Sakshi
Sakshi News home page

మోదీ ఫోటోతో గోల్డ్‌, సిల్వర్‌ బిస్కెట్లు..

Published Mon, Nov 5 2018 4:14 PM

Customer Buys Gold Bar With PMs Photo In Surath - Sakshi

సూరత్‌ : ధనత్రయోదశి సందర్భంగా సూరత్‌లోని ఓ బంగారు ఆభరణాల దుకాణంలో ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోతో కూడిన బంగారు, వెండి కడ్డీలు విక్రయిస్తున్నారు. మోదీ బొమ్మతో రూపొందిన గోల్డ్‌ బార్‌లను పెద్ద సంఖ్యలో కస్టమర్లు కొనుగోలు చేస్తున్నారని జ్యూవెలర్‌ చెబుతున్నారు. ప్రతి దీపావళికి లక్ష్మీదేవి, గణేష్‌లను కొలుస్తారని, ప్రధాని మోదీ కూడా తమకు భగవంతుడేనని, ఈ ఏడాది ప్రధాని మోదీ బొమ్మతో కూడిన గోల్డ్‌, సిల్వర్‌ బార్‌లను కొనుగోలు చేసి పూజిస్తామని ఓ కస్టమర్‌ చెబుతున్నారు.

దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన అనంతరం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున సాగుతున్న క్రమంలో దివాళీ సందర్భంగా ఆయన బొమ్మతో బంగారు, వెండి కడ్డీలు రూపొందిచాలనే ఆలోచన తనకు కలిగిందని జ్యూవెలరీ షోరూం యజమాని మిలన్‌ చెప్పుకొచ్చారు.

గతంలోనూ  ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్‌, గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీల ఫోటోలతో మిలన్‌ గోల్డ్‌ రాఖీలను తయారుచేశారు. 22 కేరట్ల బంగారంతో తయారుచేసిన ఈ కాఖీలు అప్పట్లో హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయని ఆయన వెల్లడించారు.

Advertisement
Advertisement