హార్దిక్‌పై అరెస్ట్‌ వారెంట్‌ రద్దు

Court cancels arrest warrant issued against Hardik Patel  - Sakshi

మెహ్సనా: బీజేపీ ఎమ్మెల్యేపై దాడి కేసులో పటేళ్ల ఉద్యమ నేత హార్దిక్‌ పటేల్‌పై జారీ చేసిన నాన్‌ బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ను కోర్టు రద్దు చేసింది. గురువారం ఈ మేరకు విస్‌నగర్‌ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 2015లో పటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి (పాస్‌) ఉద్యమంలో భాగంగా తన ఆఫీస్‌పై హార్దిక్‌ అనుచరులు దాడి చేశారని బీజేపీ ఎమ్మెల్యే రిషికేశ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ కేసులో కోర్టు హార్దిక్‌తో పాటు మరో ఆరుగురికి నాన్‌ బెయిలబుల్‌ అరెస్ట్‌ వారంట్‌ జారీ చేసింది. దీంతో హార్దిక్‌ గురువారం కోర్టులో హాజరయ్యారు. కేసును విచారించిన కోర్టు హార్దిక్, సర్దార్‌ పటేల్‌ గ్రూప్‌ కన్వీనర్‌ లాలాజీసహా పలువురిపై అరెస్ట్‌ వారెంట్‌ను రద్దు చేసింది.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top