మీరే అసలైన హీరో.. కరోనాపై పోరుకు రూ.100కోట్లు

Corona Virus Pandemic Vedanta Chairman Anil Agarwal Pledges Rs 100 Crore - Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని చుట్టుముట్టి భయకంపితం చేస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తి నిర్మూలనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా వ్యాప్తితతో యావత్‌ ప్రపంచం ప్రమాదపుటంచుల్లో ఉన్న దశలో కరోనాతో పోరాడడానికి రూ.100 కోట్ల భారీ విరాళాన్ని వేదాంత గ్రూప్స్‌ చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ ప్రకటించారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. 'దేశంలో అత్యవసరం అయినపుడు ఈ నిధి ఉపయోగపడుతుంది. రోజూవారీ కూలీలకు, ఇబ్బందులు ఎదుర్కొనే వారికి తన వంతుగా ఈ సాయాన్ని అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. చదవండి: ఈ పది రోజులే కీలకం

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి వందకోట్లు ప్రకటిస్తున్నాను. చాలా మంది ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ముఖ్యంగా రోజువారీ కూలీల విషయంలో నేను చాలా ఆందోళనతో ఉన్నాను. నాకు తోచినంత వారికి సాయం అందిస్తాను' అని అనిల్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. ఆయన స్పందించిన తీరుకు, ఉదాత్త హృదయానికి నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 'దేశం ఆపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేశం కోసం మేము సైతం అంటూ ముందుకొచ్చే మీలాంటి వారే అసలైన హీరోలు' అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. చదవండి: కోవిడ్‌పై రాష్ట్ర ప్రభుత్వ తాజా ఆదేశాలు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top