కరోనా ఎఫెక్ట్‌: ఇకపై విదేశీయులకు నో ఎంట్రీ | Corona Virus Cases Rise Arunachal Pradesh Bans Entry Of Foreigners | Sakshi
Sakshi News home page

కరోనా ఎఫెక్ట్‌: ఇకపై విదేశీయులకు నో ఎంట్రీ

Mar 9 2020 9:05 AM | Updated on Mar 9 2020 9:32 AM

Corona Virus Cases Rise Arunachal Pradesh Bans Entry Of Foreigners - Sakshi

ఈటానగర్‌: కరోనా వైరస్‌(కొవిడ్‌-19) ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. చైనాలో ప్రాణం పోసుకున్న ఈ మహమ్మారి ప్రస్తుతం 73 దేశాలను వణికిస్తోంది. పరస్పరం షేక్‌హ్యాండ్ ఇచ్చుకోవడానికి కూడా మనుషులు ఆలోచిస్తున్నారు. ఈ వ్యాధి సోకిన వ్యక్తులను శత్రువుల కన్నా హీనంగా చూసి, దూరంగా వెళ్తున్న ఘటనలను ఎన్నింటినో మనం చూస్తున్నాం. ముందస్తు చర్యగా కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు అరుణాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. చదవండి: కరోనా ఎఫెక్ట్‌: భారత్‌ @ 39

అందులో భాగంగా రాష్ట్రంలోకి విదేశీయుల రాకపోకలపై నిషేధం విధించింది. విదేశీయులకు అనుమతులు(పీఏపీ) ఇవ్వడాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. చైనాతో సరిహద్దును పంచుకునే అరుణాచల్‌ ప్రదేశ్‌లోకి పీఏపీలకు ప్రవేశం అనుమతించాలని విదేశీయులు కోరుతున్నా అంగీకరించడంలేదు. తాజాగా కేరళలో ఒకే రోజు ఐదు కేసులు నమోదు కావడంతో అరుణాచల్‌ ప్రదేశ్‌ అప్రమత్తమై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement