జేఎన్‌యూ విద్యార్ధి సంఘం నేతపై కేసు | Cops File Case Against Student Leader Injured At JNU | Sakshi
Sakshi News home page

జేఎన్‌యూ విద్యార్ధి సంఘం నేతపై కేసు

Jan 7 2020 10:43 AM | Updated on Jan 7 2020 1:46 PM

Cops File Case Against Student Leader Injured At JNU - Sakshi

జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత ఐషూ ఘోష్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.

సాక్షి, న్యూఢిల్లీ : జేఎన్‌యూ క్యాంపస్‌లో ముసుగు దుండగుల దాడిలో గాయపడిన విద్యార్థి సంఘం నేత ఐషే ఘోష్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. దుండగుల దాడికి ఒక రోజు ముందు ఈనెల 4న వర్సిటీ సర్వర్‌ రూమ్‌ను ధ్వసం చేశారనే ఆరోపణలపై ఐషే ఘోష్‌ సహా ఎనిమిది మందిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. హాస్టల్‌ ఫీజుల పెంపును వ్యతిరేకిస్తూ సర్వర్‌ రూమ్‌ను ధ్వంసం చేయడంతో పాటు సెమిస్టర్‌ రిజిస్ర్టేషన్‌ ప్రక్రియను అడ్డుకునేందుకు వారు సాంకేతిక సిబ్బందిపై దౌర్జన్యానికి పాల్పడ్డారని పోలీసులు ఆరోపిస్తున్నారు. సెక్యూరిటీ గార్డుపైనా ఆమె దాడి చేశారని అభియోగాలు నమోదయ్యాయి. కాగా యూనివర్సిటీ అధికారులు ముసుగులు తొడిగిన సెక్యూరిటీ గార్డులచే సర్వర్‌ రూమ్‌ను ధ్వంసం చేయించి విద్యార్ధులపై దాడులకు ఉసిగొల్పారని, విద్యార్థి సంఘం నేత ఐషూ ఘోష్‌పై దాడి చేశారని జేఎన్‌యూఎస్‌యూ విద్యార్థి సంఘం ఆరోపించింది.

చదవండి : జేఎన్‌యూ హింస : వారి పాత్రే కీలకం..

Advertisement
 
Advertisement
Advertisement