గర్ల్ఫ్రెండ్తో కలిసి కానిస్టేబుల్ నిర్వాకం | Constable, friend arrested for kidnapping boy | Sakshi
Sakshi News home page

గర్ల్ఫ్రెండ్తో కలిసి కానిస్టేబుల్ నిర్వాకం

Sep 9 2016 12:50 PM | Updated on Jul 12 2019 3:02 PM

గర్ల్ఫ్రెండ్తో కలిసి కానిస్టేబుల్ నిర్వాకం - Sakshi

గర్ల్ఫ్రెండ్తో కలిసి కానిస్టేబుల్ నిర్వాకం

సమాజంలో శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులే క్రిమినల్ కార్యకలాపాలకు పాల్పడుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి.

బహ్రైచ్: సమాజంలో శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులే క్రిమినల్ కార్యకలాపాలకు పాల్పడుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. నిన్న హైదరాబాద్లోని ఎల్బీనగర్లో ఓ కానిస్టేబుల్ మహిళలతో వ్యభిచారం నిర్వహిస్తూ అడ్డంగా దొరికిపోయిన ఘటన మరువకముందే ఉత్తర ప్రదేశ్లో మరో కానిస్టేబుల్ క్రిమినల్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

ఉత్తర ప్రదేశ్లోని బలరాంపూర్ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న మనీష్ కశ్యప్.. గర్ల్ఫ్రెండ్ శారదతో కలిసి ఓ బాలుడిని కిడ్నాప్ చేశారు. సెప్టెంబర్ 6న ఓ పదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసిన ఈ జంట.. 35 లక్షలు ఇస్తేనే బాబును వదిలేస్తామని బెదిరించారు. దీంతో బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో.. కానిస్టేబుల్ వాహనాన్ని ట్రాక్ చేసిన పోలీసులు బాలుడిని విడిపించారు. మనీష్ కశ్యప్, అతడి గర్ల్ఫ్రెండ్లను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement